జర్నలిస్టులకు తిరుమల లో వి ఐ పి బ్రేక్ దర్శనం

టి.టి.డి లో జర్నలిస్టులకు అరుదైన గౌరవం...!


అక్రెడిషన్ హోల్డర్స్ కు వీఐపీ బ్రేక్ దర్శనము అనుమతి ...


టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరిన జర్నలిస్టుల సంఘాల నేత S.జోగినాయడు


తిరుమల : ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రెడిషన్ కలిగిఉన్న జర్నలిస్టుల అందరికి వీవీఐపీ బ్రేక్ దర్శనం కలిగిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నూతనంగా చైర్మెన్ బాధ్యతలు చేపట్టిన సుబ్బారెడ్డి గారిని, జర్నిలిస్ట్ సంఘాల జేఏసీ నేత జోగినాయడు ఆధ్వర్యంలో జర్నలిస్ట్ బృంద సభ్యులు కలిసారు మీ హయాంలో జర్నలిస్ట్ లకు టీటీడీ లో విఐపి బ్రేక్ దర్శనం సౌకర్యం కల్పించాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరిగే టీటీడీ బోర్డ్ మీటింగ్ లో జర్నలిస్ట్ సమస్య కు అధికారక ఆమోదం తెలుపుతామని అన్నారు