పత్తి మిర్చి రైతులకు న్యాయం చేయాలి

 


 న్యాయం చేయాలని కోరుతూ
మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారిని కలిసి వినతిపత్రం ఇచ్చిన


పత్తి మిర్చి రైతుల వినతి


మైలవరం మండలం పుల్లూరు గ్రామానికి  చెందిన ప్రత్తి మిర్చి రైతులు మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారి ని కలిసి  తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.  కొత్తగూడెం గ్రామానికి చెందిన కె కరుణ వరప్రసాదు అనే వ్యాపారి ఐదు కోట్ల రూపాయల మేర రైతులకు కుచ్చుటోపీ పెట్టి ఐపీ నోటీసు ఇవ్వడం జరిగింది. ఫోన్  లిఫ్ట్ చేయకుండా  గుట్టుచప్పుడు కాకుండా పరారైన వ్యాపారి ముందు జాగ్రత్తగా రైతుల వద్ద ఉన్న ఆధారాలను సైతం తన వద్దకు తీసుకొని రైతులకు డబ్బులు చెల్లించకుండానే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు పోలీసులను ఆశ్రయించగా  ఐ పీ  నోటీసులు ఇవ్వడంతో  పోలీసులు కూడా తమ స్థాయిలో లేదంటూ  కాలయాపన చేయడంతో రైతులు  బుధవారం రాత్రి గొల్లపూడి లోని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి  కార్యాలయం వద్దకు వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల వీరాంజనేయులు సిఐటియు మైలవరం మండల కార్యదర్శి చాట్ల సుధాకర్ ,రైతు సంఘం మండల కార్యదర్శి వజ్రాల వెంకటరెడ్డి రైతులు ఉల్లిబోయిన. సాంబశివరావు ,తెలి తిరుపతి రావు, ఉల్లి పోయిన ఏసుబాబు, కనపర్తి సుదీర్ తదితరులు పాల్గొన్నారు.