వైసీపీ లో చేరికలు
🔹 నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 24వ డివిజన్, బాబూ జగజ్జీవన్ రామ్ కాలనీకి చెందిన బెల్లంకొండ వెంకయ్య మరియు వారి అనుచరులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గార్ల సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు.  🔹 పార్టీలో…
అవినీతి అక్రమాలను వెలికి తీసిన వార్త
అవినీతి అక్రమాలను  వెలికితీసిన వార్త జర్నలిస్ట్ సంతోష్ పై దుర్భాషలాడిన పటాన్చెరు ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి  బేషరతుగా జర్నలిస్టుకు  క్షమాపణ చెప్పాలని  వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ డిమాండ్ చేశారు  మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం జవహర…
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
హైదరాబాద్:  నగరంలోని జవహర్‌నగర్‌లో గల డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ శనివారం స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానిక కాలనీల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఆందోళన చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దుర్వాసన, కాలుష్యం, నీటి కలుషితంతో అ…
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
గుంటూరు:  జిల్లాలోని నిజాంపట్నం తీర ప్రాంతంలో పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ ఎస్‌ఐ సహా ప్రజాప్రతినిధుల అనుచరులు పట్టుబడ్డారు. అయితే ఓ ప్రజా ప్రతినిధి సోదరుడి కనుసన్నలలో పేకాట శిబిరం నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజా ప్రతినిధి వత్తిడితో దాడి విషయాన్ని …
శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని వెంకటేశ్వర కాలనీ లో ఈరోజు బస్తీ దవాఖానను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు పేద ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలకు దవాఖానాలు చేరువయ్యేలా ఉండాలని ప్రభుత్వ సంకల్పంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ ఒక్క రోజు లో జి.హెచ్.యం.సి పరిధి లో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాల ప్రారంభం ప్రస్తుతం జి.హెచ్.యం.సి పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి. ఒక్కో బస్తీ దవఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రతి ఒక్కరు బస్తీ దవాఖాన సేవ‌ల‌ను వినియోగించుకోవాలి. బస్తీ దవాఖానల్లో ఆధునిక వైద్య పరికరాలు ఉంటాయి. పేద,మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ దవాఖానాలు ఉంటాయి. మన తెలంగాణ ను ఆరోగ్య తెలంగాణ గా మార్చుకుందాం. ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు,యం.యల్.సి నవీన్ రావు గారు,యం.యల్.ఏ అరెకపూడి గాంధి గారు తదితరులు పాల్గొన్నారు.
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image