చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం మర్రుర్ గ్రామంలో ఈతకు వెళ్లి బావిలో పడి మరణించిన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విద్యార్థి....
ఇతను రావుల పెంట గ్రామం వేములపల్లి మండలం నుండి మర్రుర్ గ్రామంలో ని బంధువుల (చిన్నమ్మ) ఇంటికి వచ్చాడు.
స్నేహితులతో కలిసి ఈత వెళ్లి మునిగిపోయాడు సుమారు రాత్రి 8 గంటల సమయంలో ఫైర్ ఇంజన్ సిబ్బందికి కూడా బావిలో Dead Body దొరకలేదు.
అప్పుడే సంఘటన స్థలానికి చేరుకున్న నకిరేకల్ సీఐ బాలగోపాల్ యూనిఫాం విప్పి మానవతా దృక్పథంతో వెంటనే బావిలోకి దూకి డెడ్ బాడీ వెతికి తానే స్వయంగా తాడుకు కట్టి బావి పైన ఉన్న తన బంధువులకు డెడ్ బాడీ ని అప్పీగించడంతో వారి కుటుంబ సభ్యులు,అక్కడున్న సానికులు సి ఐ ని అభినందించారు.