కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి


 


కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  అన్నారు.   కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీకి సాయం చేస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని, పోలవరం, రాజధాని ప్రస్తావనే లేదని విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీలేదని ఆయన చెప్పారు. కార్మికులకు పెన్షన్లు ఆహ్వానిస్తున్నామని, ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డులు ఇవ్వడం మంచిదేనని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించడం సరికాదని చెప్పారు. పారిశ్రామికరంగానికి ఏం చేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.


Popular posts