రాజన్న రాజ్యం జగనన్న తోనే సాధ్యం
రైతు సంక్షేమమే జగన్మోహనరెడ్డి గారి లక్ష్యం

 

సహకార వ్వవస్దను బలోపేతం చేసే దిశగా అడుగులు

 

జి కొండూరు కెడీసీసీబ్యాంకు నందు ఎటీయం కౌంటర్ ను ప్రారంభించిన మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు అప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు కెడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ వేములకొండ రాంబాబు.

ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు రుణాలను పంపిణీ చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ

రైతులకు అన్నివిధాలుగా అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహనరెడ్డి గారి సారధ్యం లో సిద్దంగా ఉందన్నారు.  సహకార వ్వవస్దను బలోపేతం చేసేందుకు మహనేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నేరవేర్చే దిశగా అడుగులు వేయడం జరుగుతుందని అన్నారు. మైలవరం నియోజకవర్గాన్ని  రాష్ట్రంలో అదర్శ నియోజకవర్గం గా తీర్చదిద్దడం కోసం కొన్ని  సంస్థలు సహకారంతో అదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలకు రుణాలను పంపిణీ చేశారు

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జి కొండూరు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు