చెల్లిలి పై అన్న అత్యాచారం

చెల్లెలు పై అన్న అత్యాచారం
ధర్మవరం


 సభ్య సమాజం తలదించుకునేలా ఓ అన్న చేసిన ఘనకార్యం పట్టణములో వెలుగు చూపింది. వివరాలులోకి వెళ్తే శ్రీ రాములు చిన్న క్రిష్ణమ్మ,భార్య భర్తలకు తేజ ప్రతాప్ కుమారుడు ఉన్నాడు. తేజ్ ప్రతాప్ కు వివాహమై భార్య వదిలిపెట్టింది. శ్రీరాములుకు చిన్న కృష్ణమ్మకు,మనస్పర్థలు ఏర్పడి శ్రీ రాములు మాధవిని రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉన్నది. ఈమె ఎనిమిదవ తరగతి వరకు చదివి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసి పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేసిప్రతిరోజు కొత్తచెరువుకు వెళ్ళేది. శ్రీరాములు మాధవి లు బ్రతుకుతెరువు కోసం బేల్దారి పని కి బెంగళూరు వలస వెళ్లారు.చిన్న కృష్ణమ్మ కుమారుడు తేజ ప్రతాప్ తో పట్టణంలోని వైయస్సార్ కాలనీ లో నివాసం ఉన్నారు. తల్లి చెన్న కృష్ణమ్మ పని మీద వేరే ఊరికి వెళ్లిన విషయం గ్రహించిన తేజ ప్రతాప్ , తనకు చెల్లెలు వరస అయిన బట్టల దుకాణంలో పనిచేసి కొత్తచెరువు కు వెళ్లే అమ్మాయిని మాయమాటలు చెప్పి ఆదివారం సాయంత్రం పట్టణంలోని వైయస్సార్ కాలనీ కి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఆమె సోమవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు డీఎస్పీ వెంకట రమణ తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఫోక్స్ చట్టం క్రింద 376 సెక్షన్ కేసు నమోదు చేసి కోర్టు కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.