టిస్‌లో కోర్సు నిలిపివేతపై హైకోర్టులో పిటిషన్‌

టిస్‌లో కోర్సు నిలిపివేతపై హైకోర్టులో పిటిషన్‌


హైదరాబాద్‌: టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌) హైదరాబాద్‌ క్యాంప్‌సలోని కోర్సును నిలిపివేయడాన్ని ప్రశ్నిస్తూ విద్యార్థు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు  చేశారు. వారిలో ఎన్‌.అరవింద కార్తీక్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాకు చెందిన మరో ఐదుగురు విద్యార్థున్నారు. పిటిషన్‌లో కేంద్ర మానవ వనరు శాఖ ముఖ్య కార్యదర్శి, టిస్‌ రిజిస్ట్రార్‌ (ముంబై), డిప్యూటీ డైరెక్టర్‌, యూజీసీ గవర్నింగ్‌ బాడీ చైర్మన్‌తోపాటు ప్రైవేట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ డా.సి.ఎన్‌.రెడ్డిని ప్రతివాదుగా చేర్చారు. టిస్‌ రిజిస్ట్రార్‌ హైదరాబాద్‌ క్యాంప్‌సలోని కోర్సును నిలిపివేస్తూ జూలై 15న జారీ చేసిన నోటీసును పిటిషనర్లు సవాల్‌ చేశారు. టిస్‌ను యూజీసీ డీమ్డ్‌ వర్సిటీగా గుర్తించిందన్నారు. దేశవ్యాప్తంగా ఎంట్రెన్స్‌ పరీక్షు నిర్వహించి అందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా వర్సిటీలో అడ్మిషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ క్యాంప్‌సను గతేడాది రాజేంద్రనగర్‌లోని పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన భవనంలో నిర్వహించారని, విద్యార్థుకు ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్‌ దార్వా వసతి కల్పించారని పేర్కొన్నారు. క్యాంప్‌సను 2019-20 విద్యాసంవత్సరానికి గానూ అబ్దుల్లాపూర్‌మెట్‌ మండంలోని బ్రాహ్మణపల్లిలో గ కేబీ సైనిక్‌ స్కూల్‌ ఆవరణకు తరలించారన్నారు. అదే ఆవరణలో సైనిక్‌ స్కూల్‌ నడుస్తోందన్నారు. టిస్‌ క్యాంప్‌సను అబ్దుల్లాపూర్‌మెట్‌కు తరలించిన తర్వాత టెండర్లు పివకుండానే ప్రైవేట్‌ సర్వీసు ప్రొవైడర్లకు అప్పగించారని పేర్కొన్నారు. 5 నెకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.10వేతో కలిపి మొత్తం రూ.50,700 ఏకమొత్తంలో చెల్లించాని డిమాండ్‌ చేశారని, దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. దానిపై విద్యార్థు ఆందోళన చేస్తుండగా... అధికారులు  హైదరాబాద్‌ టిస్‌ క్యాంప్‌సను ఎత్తేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ఈ చర్య రాజ్యాంగ, చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు. టిస్‌ హైదరాబాద్‌ క్యాంప్‌సలో నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ, డాక్టరేట్‌ కోర్సును కొనసాగించేలా ఆదేశాు ఇవ్వాని పిటిషన్‌లో న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.