విజయవాడ లో స్టాంపేపర్ల కొరత - పట్టించు కొని అధికారులు

 


విజయవాడ లో నాన్‌ జుడీషియల్‌ స్టాంపు పత్రాల కొరత...


 పట్టించుకోని ఉన్నత అధికారులు..


 అధిక ధరలకు విక్రయిస్తున్నా స్టాంప్ వెండర్లు...


 కొరవడిన నిఘా..


వివరాల్లోకి వెళ్తే..


గత ఆరు నెలల నుంచి విజయవాడ సిటీ పరిగిలో నుంచి నాన్‌ జుడీషియల్‌ స్టాంపు (బాండ్‌ పేపర్లు) పత్రాల కొరత నెలకొంది. 


రూ.100,రూ 50 , విలువ కలిగిన నాన్‌ జుడీషియల్‌ స్టాంపు పత్రాలు లభించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 


రూ.100 విలువ కలిగిన నాన్‌ జుడీషియల్‌ స్టాంపు పత్రాలు చాలా రోజులుగా అందుబాటులో లేవనే చెప్పాలి..


కాగా గత మూడు రోజులుగా రూ.50 విలువ కలిగిన నాన్‌ జుడీషియల్‌ స్టాంపు పత్రాలు లభించకపోవడంతో అవసరం ఉన్న వారు రూ.20 స్టాంప్‌ పత్రం కొనుగోలు చేయక తప్పడం లేదు.


ముఖ్యంగా  విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఎక్కవగా లావాదేవులు జరుగుతుoటాయి..


అగ్రిమెంట్లు,ఇతర అవసరాలకు ప్రజలు వచ్చి నిరాశతో వెనుతిరిగి వెళ్ళుతున్నారు..


   రూ.100,రూ.50 విలువ కలిగిన నాన్‌ జుడీషియల్‌ స్టాంపు పత్రాల కొరత నెలకొన్న విషయం సంబంధిత అధికారులకు తెలిసినా వారు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో వినియోగదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. 


చిన్నచిన్న లావాదేవీలకు ఎక్కువగా రూ.100రూ.50 విలువ కలిగిన నాన్‌ జుడీషియల్‌ స్టాంపు పత్రాలను ఉపయోగిస్తుంటారు. 


అఫిడవిట్ల కోసం రూ.20 విలువ కలిగిన స్టాంప్‌ పత్రం వినియోగిస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కొన్ని ధృవీకరణ పత్రాలు పొందాలంటే విధిగా అఫిడవిట్‌ సమర్పించాల్సి ఉంటోంది. 


అయితే గత కొన్ని నెలలుగా స్టాంప్‌ పత్రాల కొరత నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.


 రూ.100రూ.50విలువ కలిగిన నాన్‌ జుడీషియల్‌ స్టాంపు పత్రాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంబంధిత ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది...


 *స్టాంప్ వెండర్లు దందా...* 


స్టాంప్ పేపర్ లు కొరతను అవకాశంగా తీసుకున్న కొంతమంది స్టాంప్ వెండర్లు విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో ప్రజల దగ్గర నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు..


రూ.100,రూ.50 స్టాంప్ పేపర్ లు కొరతను దృష్టిలో ఉంచుకొని రూ.20,రూ.10 రూపాయలు స్టాంప్ పేపర్ లను  అధిక ధరలకు విక్రయించి ప్రజల నుండి అందినకాడికి దోచుకుంటున్నారు..


అదంతా చూసిచూడనట్లు అధికారులు, విజిలెన్స్ అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి..


ఒక స్టాంపు వెండర్ ఒక ప్రాంతంకి లైసెన్స్ తీసుకొన్న తరువాత  ఆ ప్రాంతంలోనే  స్టాంప్ పేపర్లను  విక్రయించాలి..! కానీ అటువంటి నియమాలు ఇక్కడ పాటించారు,
విజయవాడ రూరల్ ప్రాంతంలో ఉన్న స్టాంప్ వెండర్ల్  చాలామంది విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం చుట్టుపక్కల ఉన్నారు. 


ఈ విధంగా ఉన్నటువంటి స్టాంప్ వెండర్ లైసెన్సులు ఎక్కువగా గాంధీనగర్ పరిసర ప్రాంతాలలోనే విక్రయిస్తున్నారు.


 *ముఖ్యంగా గాంధీనగర్ గురు హోటల్ పక్కన కోట వారి కాంప్లెక్స్  లో  స్టాంప్ వెండర్లు అధికంగా ఉన్నారు.* 


 *ఈ స్టాంప్ వెండర్లు లైసెన్స్ పొందినది ఒక ప్రాంతంలో అయితే స్టాంప్ పేపర్లు విక్రయిoచేది  మాత్రం గాంధీనగర్ పరిసర ప్రాంతంలో విక్రయిస్తారు..* 


ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన వారు పట్టించుకోవడం లేదు అని పలువురు చెబుతున్నారు.


వీటిపై ఏసీబీ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు, జిల్లా రిజిస్టర్ అధికారులు దృష్టి సారించ వలసిన అవసరం ఎంతైనా ఉంది..