గోదావరి నుంచి శ్రీశైలంకి నీళ్లు తెచ్చే ప్రాజెక్ట్

గోదావరి నుంచి శ్రీశైలంకి నీళ్లు తెచ్చె ప్రాజెక్ట్.. నష్టం ఎవరికి..? అద్భుతమైన విశ్లేషణ…!


గోదావరి నుంచి శ్రీశైలం కి నీళ్లు తెచ్చె ప్రాజెక్ట్ వ్యయం లక్షన్నర కోట్లు అవుతుంది ఫైనల్ గా.. మన రాష్ట్రం ఖర్చు 75,000 కోట్లు, తెలంగాణ ఖర్చు 75,000 కోట్లు. ఈ ప్రాజెక్ట్ కి ఖర్చుపెట్టే ప్రతి రూపాయి తెలంగాణ లోనే ఖర్చుపెడతారు. ఒక థంబ్ రూల్ వుంది.. ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయి నుండి ముప్పయి పైసలు తిరిగి తిరిగి ప్రభుత్వ ఖజానా లోకి టాక్స్ రూపంలో తిరిగి వచ్చేస్తుంది. అంటే లక్షన్నర కోట్లు ప్రాజెక్ట్ కడితే 50,000 కోట్లు ఖజానాలోకి తిరిగి వస్తుంది.. ఈ ప్రాజెక్ట్ మొత్తం తెలంగాణలో కడుతున్నారు కాబట్టి అది మొత్తం తెలంగాణకి పోతుంది. అంటే తెలంగాణ మొత్తం గా పెట్టేది 75,000-50,000 = 25,000 కోట్లు మాత్రమే ఏపీ మాత్రం 75,000 కోట్లు పెట్టాలి.
మొన్న కాళేశ్వరం లో చూసాము ఒక TMC లిఫ్ట్ చెయ్యటానికి 1.5 కోట్లు ఖర్చయింది అని.. అది కూడా ఒక రిజర్వాయర్ నుంచి ఇంకో రిజర్వాయర్ లోకి పంప్ చెయ్యటానికి.. రైతు పొలం దాకా నీళ్లు చేరాలి అంటే.. ఇంకో మూడు సార్లు లిఫ్ట్ చెయ్యాలి.. అవి కూడా కలుపుకుంటే TMC కి 6 కోట్లు ఖర్చు అవుతుంది. శ్రీశైలం ఇంకా దూరం కాబట్టి 8 కోట్లు అవ్వొచ్చు.. ఈ కరెంటు ఎవరిస్తారు..? తెలంగాణ సప్లై చెయ్యాలి.. ఫ్రీ గా ఇవ్వరుగా.. కనీసం 10% ప్రాఫిట్ వేసుకుంటారు.. ఆ డబ్బులు ఎవరికి వెళతాయి..? తెలంగాణకి వెళతాయి.. ఈ లాభమే సంవత్సరానికి 600-700 కోట్లు ఉండొచ్చు తెలంగాణాకి.
ఇన్ని చేసిన తరువాత తెలంగాణ రైతులు మధ్యలో తోడెయ్యారు అని గారంటీ ఏమిటి…??
జులై ఆఖరికి కూడా కాళేశ్వరం కట్టి 10 TMC మాత్రమే ఎత్తిపోశారు.. ఎందుకంటె నీళ్లు లేవు.. వాళ్ళకి నీళ్ళకి దిక్కులేదు కానీ మనకి ఇస్తారా…? రిజర్వాయర్ కట్టుకుని నీళ్లు స్టోర్ చేసుకునే ఫెసిలిటీ లేదు తెలంగాణ లో.. మనకి ఆ ఫెసిలిటీ పోలవరం లో వుంది. పోలవరం బేస్ చేసుకుని 400 TMC ఎక్కడకి కావాలంటే అక్కడకి పంప్ చేసుకోవచ్చు.. పెట్టె ఖర్చు మొత్తం ఏపీలోనే పెడతారు… టాక్సులు మనకే వస్తాయి.. ఉద్యోగాలు మనకే వస్తుంది.. మన దగ్గర అన్ని ఉంచుకుని పక్క రాష్ట్రంలో డబ్బులు పోయటం ఏంటో అర్ధం కావట్లేదు. మల్టీ స్టేట్ ప్రాజెక్ట్ కింద మన చేతికి మట్టి అంటకుండా.. అవినీతి ఆరోపణలు లేకుండా.. మన కమిషన్ మనం కొట్టేయొచ్చు అనే ఆలోచన తప్పితే మారేది కనిపించుటలేదు…