తారకరామ ఎత్తిపోతల పథకం రెండో దశ ద్వారా సాగునీటి ని విడుదల చేసిన అధికారులు
జి కొండూరు మండలం కట్టుబడి పాలెం వద్ద గల తారకరామ రెండో దశ ఎత్తిపోతల పథకం మరమ్మతులు పనులు చేపట్టిన అధికారులు బుధవారం సాగునీటి ని విడుదల చేశారు*
*మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు ఎమ్మెల్యే గా ఎన్నికైనా వెంటనే సాగునీటి పధకాలు పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా తారకరామ ఎత్తిపోతల పథకం పరిస్థితి గత పాలకుల నిర్లక్ష్యం వలన దయనీయంగా మారింది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు ఇరిగేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తారకరామ ఎత్తిపోతల పథకానికి పూర్వ వైభవం తీసుకు రావాలని సూచించారు. ఎమ్మెల్యే అదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మోటార్లు మరమ్మతులు ప్రారంభించారు. మెదటి దశ స్కీము నుండి గత వారం సాగునీటి ని విడుదల చేశారు. బుధవారం రెండో దశ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటి ని విడుదల చేసి రైతులకు సాగునీటి కష్టాలు నుండి విముక్తి కలిగించారు*
*తారకరామ ఎత్తిపోతల పథకానికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారికి ఆయకట్టు రైతులు అభినందనలు తెలుపుతూ తమ సాగునీటి కష్టాలు తొలగించేందుకు కృషి చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.