ఏపీ మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా కొత్త సంక్షేమ పథకాల విధివిధానాలపై మంత్రివర్గం చర్చలు జరిపి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా.. వాహనాలు కొనేందుకు యువతకు రుణాలు, ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలుకు రూ.1000 కోట్ల రుణం.. రుణం తీసుకునేందుకు ఆర్టీసీకి ప్రభుత్వం హామీ, రూ. 4,771 కోట్ల బాండ్ల జారీకి ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు అనుమతి, గన్నవరం నియోజకవర్గంలో విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటుకు 39 ఎకరాలు, రేణిగుంట ఎయిర్‌పోర్టు విస్తరణకు 17 ఎకరాలు, శ్రీకాళహస్తి- నడికుడి బ్రాడ్‌గేజ్ కోసం 350 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే చిరు ధాన్యాలు, అపరాలు, వరికి వేర్వేరు బోర్డులు ఏర్పాటుకు మంత్రవర్గం ఆమోదం తెలిపింది.

 

చేనేత నేస్తం పథకం ద్వారా నేతన్నలకు ఏడాదికి రూ. 24 వేలు, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు ప్రోత్సాహకం ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే న్యాయవాదులకు రూ.5 వేల ప్రోత్సాహకం ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల కార్పొరేషన్‌ ఏర్పాటు, జిల్లాల వారీగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ ఏర్పాటు, హోంగార్డుల జీతాల పెంపునకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా కొత్త సంక్షేమ పథకాల విధివిధానాలపై మంత్రివర్గం చర్చలు జరిపి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా.. వాహనాలు కొనేందుకు యువతకు రుణాలు, ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలుకు రూ.1000 కోట్ల రుణం.. రుణం తీసుకునేందుకు ఆర్టీసీకి ప్రభుత్వం హామీ, రూ. 4,771 కోట్ల బాండ్ల జారీకి ఏపీ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు అనుమతి, గన్నవరం నియోజకవర్గంలో విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటుకు 39 ఎకరాలు, రేణిగుంట ఎయిర్‌పోర్టు విస్తరణకు 17 ఎకరాలు, శ్రీకాళహస్తి- నడికుడి బ్రాడ్‌గేజ్ కోసం 350 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే చిరు ధాన్యాలు, అపరాలు, వరికి వేర్వేరు బోర్డులు ఏర్పాటుకు మంత్రవర్గం ఆమోదం తెలిపింది.

 

చేనేత నేస్తం పథకం ద్వారా నేతన్నలకు ఏడాదికి రూ. 24 వేలు, వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు ప్రోత్సాహకం ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే న్యాయవాదులకు రూ.5 వేల ప్రోత్సాహకం ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల కార్పొరేషన్‌ ఏర్పాటు, జిల్లాల వారీగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ ఏర్పాటు, హోంగార్డుల జీతాల పెంపునకు కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన