విద్య రంగంలో మార్పులు రావాలి

 


- బండ్లగూడలో ప్రయోగశాలను ప్రారంభించిన కేంద్ర
హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
విద్య రంగంలో మార్పులో రావాలని జ్ఞాన విలువలను బోధించాలని కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.  బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని శారద విద్యనికేతన్‌ పాఠశాలలో అధునాతమైన ప్రయోగశాల అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. విలువలతో పాటు సమాజా మార్పు కోసం విద్యనంది ంచాలన్నారు. చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో లింగం సుధాకర్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రావ్‌, సుదర్శన్‌రెడ్డి, విద్యసాగర్‌, విద్య పిఠా ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.