ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.

తెలంగాణలో స్థానిక ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్లకు వేతనాలు విడుదల చేస్తూ తెలంగాణ సర్కారు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. తెలంగాణలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రతి నెలనెల వేతనాలు చెల్లించడం అనవాయితీ. అయితే కేసీఆర్ సర్కారు ప్రజాప్రతినిధుల వేతనాలను ప్రతిమూడు నెలలకు ఓసారి విడుదల చేస్తుంది. అయితే గతంలో కేసీఆర్ సర్కారు వేతనాలు ఇవ్వకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు.