కాల్స్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గింపు

 


టెలికాం సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ ఫోన్ కాల్స్ రింగింగ్ సమయాన్ని 25 సెకన్లకు తగ్గించాయి. ఇప్పటి వరకు 30 నుంచి 45 సెకన్ల పాటు ఫోన్ కాల్స్ రింగ్ అయ్యేవి. కానీ ఇకపై తగ్గించిన సమయం మేర రింగ్ అవుతాయి. అయితే ఆ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటానికి గల కారణం జియోనే అని తెలుస్తోంది. ఇటీవలే జియో ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జి (ఐయూసీ) నిబంధనలకు విరుద్ధంగా రింగింగ్ సమయాన్ని 20 సెకన్లకు తగ్గించి.. మళ్లీ 5 సెకన్లు పెంచి.. ఆ సమయాన్ని 25 సెకన్లు చేసింది. దీంతో జియో బాటలోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఆ సమయాన్ని 25 సెకన్లకు కుదించాయి.