పార్టీ కీలక ముఖ్యులతో ఈ సాయంత్రం సీఎం వైయస్‌.జగన్‌ సమావేశం

 


అమరావతి: పార్టీ కీలక ముఖ్యులతో ఈ సాయంత్రం సీఎం వైయస్‌.జగన్‌ సమావేశం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంకు వ్యతిరేకంగా ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలపై చర్చలో ప్రస్తావన
సంబంధిత ఎంపీకి క్లాస్‌ తీసుకోవాల్సిందిగా ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జి వై.వి.సుబ్బారెడ్డికి ఆదేశం
ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న వారంతా పేద వర్గాల పిల్లలే: సీఎం వైయస్‌.జగన్‌
వారి జీవితాలు మారాలన్న మంచి ఆలోచనతోనే ఇంగ్లిషు మీడియం పెడుతున్నాం:
ఇంగ్లిషు మీడియం వద్దంటున్న పత్రికలు, పార్టీల అధిపతుల పిల్లలంతా ఇంగ్లిషు మీడియంలోనే చదువుతున్నారు:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారి పిల్లలు మాత్రమే ప్రధానంగా ప్రభుత్వ బడుల్లో ఉంటున్నారు:
ఇంగ్లిషు మీడియంతోనే వీరి జీవితాలు మారతాయన్న గట్టి నిర్ణయం మన ప్రభత్వం తీసుకుంది:
ఈ నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకించినా, వ్యతిరేకిస్తూ ఎవరు మాట్లాడినా అటువంటి వారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించే ప్రశ్నే ఉండబోదు:
ధనికుల పిల్లలకు మాత్రమే ఇంగ్లిషు మీడియం, పేదపిల్లలకు తెలుగు మీడియం అన్న విధానాన్ని సమర్థిస్తూ ఎవరు వ్యాఖ్యలు చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు, పార్టీ నుంచి బహిష్కరించేందుకు ఏ మాత్రం ఉపేక్షించం: సీఎం శ్రీ వైయస్‌.జగన్‌