ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు అండగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ ఆహార శిభిరాలను ముమ్మిడివరం జనసేనపార్టీ కార్యాలయం నందు,కాట్రేనికోన మరియు చెయ్యేరు గ్రామాల్లో రాష్ట్ర PAC సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పితాని బాలకృష్ణ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి
డి.యమ్.ఆర్.శేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో జనసేన నాయకులు పాలెపు ధర్మారావు,గోదశి పుండరీష్,యలమంచిలి బాలరాజు,దూడల స్వామి,నూకల దుర్గ,బండారు వెంకన్న బాబు,దామిశెట్టి రాజా,మాదాల శ్రీధర్,ఏడిద దొరబాబు,కాయల బలరాం,నంద్యాల శివాజీ,బీమాల సూరి తదితరులు పాల్గొన్నారు.