రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు.
అందుబాటులో నిత్యావసర వస్తువులు.
ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ప్రజలు సోషల్ డిస్ట్రిన్స్ పాటిస్తూ నిత్యావసర వస్తువులు కోనుగోలు చేయాలి.
ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు కోటి 29లక్షల తెల్లకార్డు దారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏప్రిల్ నెల రేషన్ ఈనెల 29నే ఇస్తాం.
ప్రజలు ఎవరు రేషన్ షాపులకు రానవసరంలేదు.
వాలంటీర్ల ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఇంటికి రేషన్ సరుకులతో పాటు కిలో కందిపప్పు ఫ్రీ గా ఇవ్వడం జరుగుతుంది.
రాష్ట్రంలో అర్దిక పరిస్థితి బాగోకపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకూడదని తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి
వచ్చే నెల 4వ తేదీన వాలంటీర్లు ద్వారా ఇంటికే 1000 చేరవేస్తాం.
కరోనా మహమ్మారి వ్యాప్తిస్తున్న నేపథ్యంలో రేషన్ షాపులో బయోమెట్రిక్ తాత్కాలికంగా రద్దు.
వాలంటీర్లు నిర్దారణ ద్వారా రేషన్ సరుకులు...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో దేశంలో ఏ రాష్ట్రానికి లేని వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థలు మనకు ఉన్నాయి.
వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే అనేక విషయాలలో సమర్థవంతంగా పనిచేస్తున్నారు.
కరోనాని కట్టడి చెయ్యటానికి వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థ అంధ్రప్రదేశ్ లో కీలకం.