విశాఖ గ్యాస్‌ లీక్ ఘటన దురదృష్టకరమని మంత్రి కొడాలి నాని

విశాఖ గ్యాస్‌ లీక్ ఘటన దురదృష్టకరమని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. దేశంలో ఇంత పెద్ద ఆర్థికసాయం చేసిన సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి మాత్రమేనని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా పలు విషయాలు ప్రస్తావించిన ఆయన.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దృష్టిలో సీఎం వేసిన కమిటీ, కేంద్రం వేసిన కమిటీలు పనికిరానివా..? అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.