అమ్మఒడి తో ప్రభుత్వ పాఠశాలలు నిలబడతాయా

ఇక్కడ ఓ చిన్న కథ చెబుతా చూడండిగతం లో RTC బస్సులు పల్లె పల్లెకు తిరిగేవి. తరువాత ఆటో లకు అనుమతులు ఇచ్చారు. బస్ వాడు ఛార్జ్ 10 రూపాయలు తీసుకుంటే ఆటోవాడు 8 రూపాయలు ఇవ్వండి చాలు అన్నాడు. దాంతో ఇదేదో బాగుందంటూ… అందరు ఆటో లు ఎక్కడం మొదలెట్టారు. బస్ కు ప్రయాణికులు తగ్గేసరికి బస్ ట్రిప్ లను RTC తగ్గించింది. అదే అదనుగా ఆటో ఛార్జీని10 రూపాయలు చేసాడు. అక్కడ 10… ఇక్కడ 10 అని అందరు ఆటో లో తిరగడం మొదలు పెట్టారు.ఎవ్వరు ఎక్కడం లేదని ఆ రూట్ లో బస్ సర్వీసు ఆపేశారు.అప్పుడు మొదలైంది ఆటో దోపిడీ…. బస్ లేదు… ప్రజలకు ఆటో తప్ప దిక్కు లేదు… అంతే 15 రూపాయాలిస్తేనే తీసుకెళ్తా అని మొదలెట్టాడు. అటు బస్ లేక మరో దిక్కు లేక అందరు 15 రూపాయాలిచ్చి ఆటోలలో తిరగడం మొదలెట్టారు… ఇదే కథ ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తుంది. అమ్మ ఒడి ద్వారా 15000 వేలు ఇస్తే ప్రయివేటు పై ఉన్న మోజుతో, ప్రయివేటు వారి ప్రలోభాలతో చాలా మంది వారి పిల్లలను ప్రయివేటు పాఠశాల లలో జాయిన్ చేస్తారు. అలా… అలా… పిల్లలు తగ్గిపోతే ప్రభుత్వ పాఠశాల లను మూసివేత ప్రారంభం అవుతుంది…. ఆ తరువాత ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోవడం అప్పుడు ప్రయివేటు పాఠశాల లే దిక్కు అవుతాయి. అప్పటికి ప్రభుత్వం ఈ అమ్మఒడి పధకం కొనసాగించదు. దానితో చచ్చినట్టు వాళ్ళు ఎంతంటే అంత ఫీజు ఇచ్చుకొని చదివించాలి…