అవినీతి అక్రమాలను వెలికితీసిన వార్త జర్నలిస్ట్ సంతోష్ పై దుర్భాషలాడిన పటాన్చెరు ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బేషరతుగా జర్నలిస్టుకు క్షమాపణ చెప్పాలని వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ డిమాండ్ చేశారు మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో జవహర్ నగర్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యవర్గ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా నిరసన కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జవహర్ నగర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వార్తా దినపత్రిక రిపోర్టర్ సంతోష్ ను అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్యేఫై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి తక్షణమే అరెస్టు చేయాలని, డిమాండ్ చేశారు విలేకరులతో దురుసుగా ప్రవర్తించే వారిపై కఠినమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను రూపొందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. జవాన్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు నాగేంద్రబాబు తో పాటు పలువురు జర్నలిస్టు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో NWJA ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ త్యాగి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగేంద్రబాబు, ఉపాధ్యక్షుడు గోపాల్ చారి, రమేష్ చారి, రాజు, సత్యనారాయణ,కిరణ్, విష్ణు, రమేష్ ,
రవిందర్,సోమ చారి, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.