రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం

తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమాకోహ్లీ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గురువారం ఉదయం 11.50 గంటలకు గవర్నర్‌ తమిళిసైసౌందర్‌రాజన్‌ జస్టిస్‌ హిమాకోహ్లీతో ప్రమాణం చేయించారు. చీఫ్‌ జస్టిస్‌గా నియమిస్తూ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను ఆమెకు గవర్నర్‌ అందజేశారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చీఫ్‌ జస్టిస్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటైన తర్వాత చీఫ్‌ జస్టిస్‌ అయిన తొలి మహిళగా హిమాకోహ్లీ గుర్తింపు పొందారు.  కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జీ జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, వీ శ్రీనివాస్‌గౌడ్‌, సీ మల్లారెడ్డి, మానవహక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జీ చంద్రయ్య, హైకోర్టు న్యాయమూర్తులు ఎంఎస్‌ రామచంద్రారావు, ఏ రాజశేఖర్‌రెడ్డి, పీ నవీన్‌రావు, చల్లా ,కోదండరాం, అభినందన్‌కుమార్‌ షావిలి, అమర్‌నాథ్‌గౌడ్‌, శ్రీదేవి, వినోద్‌కుమార్‌, అభిషేక్‌రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నర్సింహారెడ్డి, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సూర్యకరణ్‌రెడ్డి, ఏజీ బీఎస్‌ ప్రసాద్‌, న్యాయశాఖకార్యదర్శి సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.