ఎమ్మెల్సీ ఎన్నికలు తెరాస ప్రచారం


  ప్రచారానికి లభించిన స్పందనతో విజయం పై ధీమా పెరిగింది....సికింద్రాబాద్ : రానున్న ఎంఎల్సీ ఎన్నికల్లో  సికింద్రాబాద్ నుంచి మంచి ఆధిక్యత లభించేలా తెరాస శ్రేణుల కృషి చేయాలని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరధిలో ఎంఎల్ సీ ఎన్నికల పై  మంత్రి  శ్రీ గంగుల కమలాకర్  శుక్రవారం సమీక్షను నిర్వహించారు. సితఫలమండీ లోని ఏం ఎల్ ఏ క్యాంపు కార్యాలయంలో   ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా శ్రీ గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెరాస అభ్యర్ధి శ్రీ సురభి వాణి దేవికి పట్టభద్రుల నుంచి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. తెరాస శ్రేణులు, స్థానిక పట్టభద్రులు సమన్వయంగా వ్యవహరించేలా ఏర్పాట్లు జరుపుతున్నామని తెలిపారు. శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు పూర్తి సన్నద్ధం చేశామని, ఐదు డివిజన్లలో 17 పొలింగ్ బూతల పరిధిల్లో ఓటర్లను తాము, తమ శ్రేణులు వ్యక్తిగతంగా కలిసినట్లు తెలిపారు. ప్రచారానికి మంచి స్పందన లభించిందని  శ్రీమతి వాణి దేవి విజయం ఖాయమని ఆయన అన్నారు. ఎన్నికల పరిశీలకులు, మంచిర్యాల ఎమ్ ఎల్ ఏ శ్రీ దివాకర్ రావు మాట్లాడుతూ సికింద్రాబాద్ లో తెరాస కు మంచి ఆధిక్యత లభిస్తుందని తెలిపారు.  పరిశీలకులు శ్రీ శ్రీనివాస్, శ్రీ శ్రీకాంత్, యువ నేత శ్రీ విజిత్ రావు    , సమన్వయకర్తలు   శ్రీ రాజ సుందర్, జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.