కాబోయే సీఎం ఆయనేనా ?

కాబోయే సీఎం ఆయనేనా ? హలో అంటూ మోడీ పలకరించింది అందుకేనా ?కూర్చోడానికి కుర్చీ ఉంది. తిరగడానికి కాన్వాయ్ ఉంది. సెల్యూట్ కొట్టడానికి బడా సెక్యూరిటీ ఉంది. అన్నా అనీ అనగానే లగెత్తుకొచ్చేందుకు అసంఖ్యాక అధికారిక పరివారమూ ఉంది. అంతా బాగానే ఉంది కానీ, దీనెబ్బ జీవితం శశికళ కలలోకి వచ్చి కంగారు పెట్టేస్తోందబ్బా ఈ మధ్య ! ఇంతకీ ఎవరా శశీ ? ఏంటా స్టోరీ ? అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకపోవడమే దౌర్భాగ్యం అంటే ! అలాంటి దౌర్భాగ్యాన్ని అనుభవించే వాడు అర్థం చేసుకోవాల్సిందే, తప్పితే దూరం నుంచి చూసేవాడు డిఫైన్ చేయలేడు.పై పెచ్చు ఇప్పుడు సొంత పార్టీలోనే మరో టాక్ బయల్దేరింది. ఉన్నట్టుండి ఆయన సీఎం అవుతాయేమో, బీజేపీ సీఎం కేండిడేట్ ఆయనేనేమో అని ఒకటే కంగారు. కొత్త అంచనాలు. వద్దన్నా వినిపిస్తున్న గుసగుసలు. నీ  గసగసాలు నూరినా ఇంత మసాలా పండదేమో ! ఇంతకీ ఎందుకీ ప్రచారం ? బీజేపీ ఓ చిత్రమైన పార్టీ. నేను నీ కట్టు బానిసను దొరా, అని గుండె చీల్చి ప్లేటులో పెట్టి ముందు పెట్టినా నమ్మదు. అపనమ్మకం అలాంటిది. ఎందుకంటే – గుండె మాత్రమే తీశావ్, లివర్ కిడ్నీ ఇవ్వలేదుగా అంటుంది ఎదురు ! అలాంటి పరిస్థితికి తోడు ఆ పార్టీకి యమ ఆకలి. అన్ని రాష్ట్రాల్నీ కమ్మేయాలని కోరిక. అందుకే తమిళనాడు ఫార్ములా గుర్తొస్తోంది. అక్కడ కూడా అంతే ! సగంపైగా కేసుల్లో చిత్రం జరిగింది. ఏ1 ను వదిలిపెట్టేసి ఏ2కి శిక్ష వేశారు. అదే కనుక ఇక్కడ రివర్స్ లో జరిగితే అంటే ఏ2ను వదిలేసి – ఏ1 ను మసాలా నూరితే ఏంటి పరిస్థితి ! ఇప్పుడు ఇదే గుసగుస. టెన్షన్. దానికితోడు ఆ విధేయుడుకి విధేయత ఓ పెద్ద వ్యవనం అయిపోయింది. ఎవరికైనా విధేయుడుగానే ఉంటున్నాడు.


నా దగ్గర ఉంటే నాకు విధేయుడు. ఢిల్లీలో ఉంటే వాళ్లకి విధేయుడు, అన్నట్టు తయారైంది పరిస్థితి. అందుకే టీడీపీ వాళ్లని తీసుకెళ్లి ఓఎల్ఎక్స్ లో పెట్టకుండానే వాళ్లకి అమ్మేస్తున్నాడు. ఐ యామ్ ఎట్ యువర్ సర్వీస్ అంటున్నాడు పొలిష్డ్ గా ! ఆయన యోగా కూడా బాగా చేస్తాడు లెండి. అందుకే అన్ని సాధించాడు. జైల్లో ఉండగా మనశ్శాంతి సాధించాడు అదే యోగాతో ! ఇఫ్పుడు బీజేపీతో సాన్నిహిత్యం తెచ్చుకునేందుకు కూడా అదే యోగా ఉపయోగ పడుతోంది. అధికార యోగానికి కూడా అదే మలి మెట్టు అయినా కావొచ్చేమో !