కరకట్టపై భవనాలకు నోటీసులు

అమరావతి: కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమానికి సీఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై ఆశ్రమ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏ నోటీసులపై ఈనెల 16న హైకోర్టు విచారించింది. నాలుగు వారాలు గడువివ్వాలని సీఆర్డీఏకు హైకోర్టు సూచించింది. అయితే నోటీసుల జారీ చేసిన వ్యవహారాన్ని సీఆర్డీఏ అధికారులు గోప్యంగా ఉంచారు.


అలాగే కరకట్ట పక్కనే నిర్మించిన ఆరోగ్యాలయంలో కూడా నిబంధనలు ఉల్లంఘించారని సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. నిర్మాణాలను కూల్చేస్తామని నోటీసుల్లో పేర్కొంది. సీఆర్డీఏ నోటీసులపై నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. నిర్వాహకుల వివరణకు నాలుగు వారాలు గడువివ్వాలని హైకోర్టు ఆదేశించింది.