నీటి సమస్యను కలెక్టర్ పరిష్కరించాలి

జిల్లాలోని తీవ్ర నీటి సమస్యను కలెక్టర్ పరిష్కరించాలి


 


నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డినెల్లూరు జిల్లాలో తీవ్రంగా నెలకొని ఉన్న నీటి సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ తీవ్రంగా కృషి చేయాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్కు సూచించారు జిల్లా పరిషత్ హాలులో ఆదివారం జరిగిన చివరి సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము కొత్తగా ఎన్నికై ఆఖరు సమావేశానికి రావడం బాధ కలిగిస్తోందని అన్నారు జిల్లాలోని అనేక సమస్యలపై సభ్యులు ఐదేళ్లుగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారని ,వాటికి పరిష్కారాలు కూడా కనుగొన్నారని చెప్పారు.అందుకు సభ్యులందరికీ అభినందనలు తెలిపారు ఆఖరి సమావేశం లో తాను సమస్యల గురించి మాట్లాడటం  అంత మంచిది కాదేమో అని అభిప్రాయపడ్డారు జిల్లాలోని నీటి సమస్యపై కలెక్టర్ శేషగిరిబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం పత్రికల్లో చూశానని చెప్పారు గతంలో ఆయన ఇక్కడ పనిచేసిన అనుభవం ఉన్నందున ఈ జిల్లాకు మరింత మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సమావేశానికి జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , వరప్రసాద్ రావు, చంద్రశేఖర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి, జడ్పిటిసి సభ్యులు అధికారులు పాల్గొన్నారు


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
వైసీపీ లో చేరికలు