ధైర్యంగా ముందుకు కదులు.. సమాజమో నువ్వో తేల్చుకుందాం!

ధైర్యంగా ముందుకు కదులు.. సమాజమో నువ్వో తేల్చుకుందాం!


భయపడి పరిగెడుతూ ఉండు.. వెంటబడి మరీ భయపెడతారు!


అలా పరిగెడుతున్నప్పుడు ఒక్క నిమిషం ఆగి రొమ్ములు విరుచుకుని ధైర్యంగా నిలబడు..


తోక ముడుచుకుని పారిపోతారు! యెస్.. ఇది సమాజ నైజం!


ఇక్కడ ఎవడూ ఆకాశం నుండి ఊడిపడ్డ వాడు లేడు! తన దగ్గర ఉన్న డబ్బులు చూసుకుని, తన చుట్టూ ఉండే పదిమందిని చూసి, తన పేరుని చూసీ ఎక్కడనుండో దిగివచ్చిన దైవదూతల్లా ఫీలవుతుంటారు. లోపలంతా ఖాళీ పెట్టుకుని పైకి గంభీరంగా నడుస్తుంటారు. నీ చుట్టూ ఉన్న 99% శాతం మంది పిరికి వాళ్లే.. ఈ ఒక్క విషయం జీవితాంతం గుర్తు పెట్టుకో!


నువ్వు eye to eye కాంటాక్ట్ మెయింటైన్ చేసిన రోజున చాలామంది కనీసం నీ కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం కూడా చెయ్యలేరు. అదీ వాళ్ల మేకపోతు గాంభీర్యం. భయపడకు.. నీ చుట్టూ ఒక్కడు లేకపోయినా నీ సెల్ఫ్ ఇమేజ్‌ని నమ్ముకో!


ఎవడేం పీకుతాడు? రమ్మనండి! నీ లైఫ్ నీది! దాన్ని ఎవడో భయపెట్టేదేంటి? బిక్కుబిక్కుమంటూ బ్రతక్కు. నీలోని ఇన్‌ఫీరియారిటీని చూసి జనాలు రెచ్చిపోతారు. వాళ్లలో అసలు గొప్ప క్వాలిటీస్ ఏమీ లేకపోయినా నిన్ను చూసి నవ్వుతారు.. నిన్ను చులకన చేసి మాట్లాడి అది గొప్పలా ఫీలవుతారు! ఎందుకూ పనికిరాని పురుగుల్లాంటి బ్రతుకులు అవి. క్షమించి వదిలేయ్!


ఈ ప్రపంచం మొత్తం తిరగబడినా అలాగే నిలబడు… ధైర్యంగా నిలబడు.. ఒక్క అంగుళం కూడా తొణకకు, బెణకకు.. అదీ చూద్దాం ఎవడేం చేస్తాడో!! నువ్వు కాన్ఫిడెంట్‌గా చూసే ఒక్క చూపుతో పారిపోయే పిరికిపందల్ని చూసి ఎన్నాళ్లని భయపడతావు? లే తెగించు.. అణువణువునా ధైర్యంగా ముందుకు కదులు.. సమాజమో నువ్వో తేల్చుకుందాం!