స్థానిక ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ ఘనవిజయం

స్థానిక ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ ఘనవిజయం


 - ఎల్‌డిఎఫ్‌కు 22 , యుడిఎఫ్‌కు 17 స్థానాలు
- శబరిమలలో లెఫ్ట్‌ అభ్యర్థి జయకేతనం
- రాహుల్‌ నియోజకవర్గంలోనూ భారీ ఆధిక్యతతో గెలుపు
తిరువనంతపురం : కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారిక ఎల్‌డిఎఫ్‌ ఘనవిజయం సాధించింది. 13 జిల్లాల్లోని 44 డివిజన్లు, మున్సిపల్‌ వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌ 22 స్థానాల్లో గెలుపొందింది. 17 స్థానాలను యుడిఎఫ్‌ కైవసం చేసుకుంది. బిజెపి ఐదు స్థానాలకు పరిమితమైంది. ఎల్‌డిఎఫ్‌ సాధించిన సీట్లలో ఎనిమిది సీట్లు గతంలో యుడిఎఫ్‌ గెలుపొందినవి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సిపిఎం, ఎల్‌డిఎఫ్‌ పార్లమెంటు సీట్లు కోల్పోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 28న వచ్చిన ఈ ఫలితాలు ఎల్‌డిఎఫ్‌ పట్టును కోల్పోలేదని తేల్చాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలరోజుల అనంతరం కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన