అవినీతి జరిగిన ప్రతి అంశంపైన విచారణ

అవినీతి జరిగిన ప్రతి అంశంపైన విచారణ


అవినీతిపై సబ్ కమిటీ విచారించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది


45 రోజుల్లో కమిటీ పనిపూర్తి చేయాలని సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు


* గత ప్రభుత్వ పాలనలో ఎంతో అవినీతి జరిగిందని ఎన్నో సంస్థలు, వ్యక్తులు ఆరోపణలు చేశారు*


ప్రాజెక్టులు, రాజధాని పనులు, పోలవరం, గ)హ నిర్మాణంపై ఫోకస్


అసెంబ్లీ సమావేశాలు కారణంగా, ఏర్పాట్లు పూర్తికానందున ప్రజాదర్భార్ వాయిదా


సీఎం శ్రీ వైయస్ జగన్ గారితో ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం


హాజరైన మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, ప్రత్యేక ఆహ్వానితులు


శ్రీ వైయస్ జగన్ గారితో పూర్తైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం



సమావేశ వివరాలను మీడియాకు తెలిపిన మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, కన్నబాబు


- ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ...


- ముఖ్యంగా గత 5 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుందని వాటిల్లో అవకతవకలు ఉన్నాయని వివిధ సంస్థలు, వ్యక్తులు ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ ఆరోపణలు ప్రజలు పరిగణలోకి తీసుకన్నారు కాబట్టే 2019 ఎన్నికల్లో తమ నిర్ణయం తెలిపారని బుగ్గన రాజేంద్రనాధ్ అన్నారు.


- గత 5 సంవత్సరాల టీడీపీ ప్రభుత్వం విపరీతమైన అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలు నమ్మారు. దీనిపై ఎంతో మంది ఇంజనీరింగ్ నిపుణులు, మాజీ బ్యూరోక్రాట్ నిపుణులు చెప్పారు. మాజీ ఇద్దరు బ్యూరోక్రాట్ నిపుణులు భారీగా అవినీతి జరిగిందని, ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. వీటిని అన్నింటిని సరిచేయటానికి చేయటానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 26, 2019న జీఓ నెం 1411 ద్వారా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని బుగ్గన రాజేంద్రనాధ్ వివరించారు.


ఈ సబ్ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే... ఏఏ విషయాల్లో మరి ప్రాజెక్టులు, నిర్మాణాత్మక పనులు ఎక్కువ ధరలకు కేటాయించడం సింగల్ టెండర్ రావటం, అవినీతి ఆరోపణలు ఎక్కడైతే ఉన్నాయో పరిశీలించటం, కొన్ని ప్రాజెక్టులు అవసరమా, లేదో పరిశీలించటం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు.


- సబ్ కమిటీ నివేదిక ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖలు సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్, సెంట్రల్ ఏజెన్సీ కావొచ్చు అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. ప్రజాధనం ఏదైతే ఉన్నదో.. ప్రజలు పన్నులు కట్టిన డబ్బు సక్రమంగా వినియోగం అయ్యాయా లేక అవినీతి ఏమైన జరిగిందా? ఒక అవినీతి జరిగి ఉన్నట్లైతే దాన్ని సరిచేయటం చేయటం ఎలా? అన్న దానికోసమే ఈ సమావేశం అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున పారదర్శకమైన పరిపాలన, అవినీతిలేని పరిపాలన చేస్తామని ప్రకటించడం జరిగింది. ఎక్కడా ప్రజాధనం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తగా ఉపయోగించాలనే సబ్ కమిటీ వేశారని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు.


- సబ్ కమిటీ వేటిమీద విచారణ చేస్తుందని మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ.. భూకేటాయింపులు కావొచ్చు, రాజధాని భూములు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయ్. గత ప్రభుత్వం ఏదీ వదిలిపెట్టలేదని చివరకు పుష్కరాలప్పుడు నీటి ప్యాకెట్లు, షామియానాలు కూడా ఉన్నాయ్ అని బుగ్గన వివరించారు. మీరు పెద్ద పెద్దవి అడుగుతున్నారు టీడీపీ వాళ్లు ఏదీ వదలపెట్టలేదని దోమలపై దండయాత్ర, ఎలుకలు పట్టడానికి 6 లక్షలు ఖర్చు పెట్టిన సంఘటనలపైనా విచారణ జరుగుతుందని బుగ్గన అన్నారు. విచారణ జరిగాక భవిష్యత్ లో తప్పులు జరగక్కుండా ఇదొక హెచ్చరికగా ఉంటుందన్నారు. అంశాలు ఎక్కువ ఉన్నా.. ముఖ్యమైనవి ఎవరిపాటికి వారు విడిపోయి దర్యాప్తు చేస్తారని బుగ్గన తెలిపారు. నీటిపారుదల, అర్బన్ హౌసింగ్, భూకేటాయింపులు, రాజధాని భూములు ప్రధానమైనవిగా ఉన్నాయని బుగ్గన తెలిపారు. అవినీతికి ఏ ఒక్కటినీ గత ప్రభుత్వం వదిలిపెట్టలేదని బుగ్గన అన్నారు.


వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ..


- ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రజల్ని కలుసుకొని వారి వినతులు స్వీకరించే ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని రేపటి నుంచి జరగబోతోందని మీడియాలో కథనాలు వస్తున్నాయని దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కన్నబాబు స్పష్టం చేశారు. త్వరలో ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం వైయస్ జగన్ సంకల్పించారని అయితే ఈలోపు అసెంబ్లీ కార్యక్రమాలు ప్రారంభం కానున్నందున, వచ్చే ప్రజలకు వసతులు ఏర్పాటు పూర్తి కాకపోవటం వల్ల ప్రజాదర్భార్ వాయిదా పడిందని కన్నబాబు తెలిపారు.


రైతుల పట్ల అమానుషంగా వ్యవహరించొద్దని బ్యాంకులకు ఆదేశాలు
రైతుల పట్ల సామరస్యపూర్వకంగా వ్యవహరించండి
కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఇది రైతు ప్రభుత్వం
ప్రకాశం ఘటనను సీరియస్ గా తీసుకున్నాం


- కొన్ని కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులు, నేషనల్ బ్యాంకులు రైతులు నుంచి రుణాలు వసూలు చేసే విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే సమాచారం వచ్చిందని కన్నబాబు తెలిపారు. ఆ పద్ధతులు మార్చుకోవాలని వ్యవసాయ శాఖ నుంచి కొన్ని బ్యాంకుల వారికి ఆదేశాలు జారీచేయటం జరిగిందని కన్నబాబు తెలిపారు. నిన్ననే ప్రకాశం జిల్లాలో డీసీసీబీ బ్యాంకు ఓ రైతు భూమిలో జెండాలు పాతినట్లు మాకు సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారికి కూడా తెలిపామని చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేయటం జరిగింది. . రైతులకు నచ్చ చెప్పి.. ఒకటికి నాలుగు సార్లు వారి ఇంటికి వెళ్లి గౌరవపూర్వకంగా రుణాలు వసూలు చేసుకోండి తప్ప.. వారిని అవమానపరిచే కార్యక్రమాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశాం. సంబంధిత కలెక్టర్ తోనూ మాట్లాడటం జరిగిందని కన్నబాబు అన్నారు. ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే ప్రకటన చేసి ఉన్నారు. అదే విధంగా అధికారులు రైతులతో సంయమనంతో ముందుకు వెళ్లాలని చెబుతున్నాం. రైతుల్ని ఆదుకునే కార్యక్రమాలను నెల రోజుల్లోనే సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రకటించారు. రైతులు కూడా ఒత్తిడికి గురికాకుండా సంయమనంగా ఉండాలని కోరుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు తెలిపారు.