బీజేపీకి టచ్ లో టీడీపీ నేతలు

బీజేపీకి టచ్ లో చంద్రబాబు సన్నిహితులు: బాంబు పేల్చిన జీవీఎల్.....అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ కట్టడాన్ని తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.


కరకట్టమీద ఉన్న అక్రమ కట్టడాలన్నింటిని కూల్చివేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీలో చేరేందుకు చాలా మంది నేతలు క్యూ కడుతున్నారని చెప్పుకొచ్చారు.


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలు సైతం తమతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అంధకారమయం అన్న జీవీఎల్ జనసేన పార్టీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.