ఎన్ ఎండి చారిటీస్ సేవలు భేష్ ఎం పి ఆదాల

ఎన్ ఎండి చారిటీస్ సేవలు భేష్


 
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిఎన్ ఎం డి చారిటీస్ ద్వారా సయ్యద్ నిజాముద్దీన్ మంచి సేవలు చేస్తున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆయా హెచ్ఎంల ద్వారా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అంతకు ముందు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ ఎన్ఎండి చారిటీస్ వేసవిలో పోలీసులకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు శీతల పానీయాలు అందజేసిందని గుర్తు చేశారు .ఎన్నో హెల్త్ క్యాంపులు నిర్వహించిందని చెప్పారు .ఎన్ఎండి చారిటీస్ భవిష్యత్తులో మరిన్ని సేవలు చేయాలని కోరారు. నవలాకుల గార్డెన్ ,అల్లిపురం గుడిపల్లి పాడు మొగల్ల పాలెం బుజబుజ నెల్లూరు అంబాపురం దొరతోపు ఆర్ జి ఆర్ నగర్ మాదరాజ గూడూరు, ములుమూడి, భగత్ సింగ్ కాలనీ తదితర స్కూళ్లకు వెయ్యికి పైగా పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి కొన్ని స్కూళ్లకు పుస్తకాలను పంపిణీ చేశారు .నిజాముద్దీన్ జనార్దన్ రెడ్డి అబూబకర్ నరసింహారావు డాక్టర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పేరనేటి కోటేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు