ముఖ్యమంత్రుల సమావేశం

తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రుల సమావేశం...!


హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల మధ్య అపరిషృతంగా ఉన్న సమస్యలపై చర్చించడానికి ఇరువురు ముఖ్యమంత్రులు శుక్రవారం భేటీ కానున్నారు. ప్రగతి భవన్‌లో ఉదయం 10 గంటలకు  తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో విభజన అంశాలు, కృష్ణా, గోదావరి నదుల నీటి వినియోగంపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా హాజరవుతారు.


Popular posts