అస్లీల వీడియోలు నిలుపుదల చేయండి

మహిళ ల డిమాండ్ 


యూ ట్యూబ్, వివిధ వెబ్ సైట్ లలో తదితర సామాజిక మాధ్యమాలలో అశ్లీల వీడియో ల ప్రసారం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కోరారు. ఈ మేరకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శుక్రవారం సచివాలయంలో గాయత్రి వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్, మైత్రి మహిళా సమితి, ఝాన్సీ లక్ష్మి బాయి వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పుష్పలత, రుక్మిణి రెడ్డి, దశరథ లక్ష్మీ, ప్రొఫెసర్ కవిలత కలిసి వినతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అత్యధికంగా వివిధ వెబ్ సైట్ ల లో అశ్లీల చిత్రాలను చూస్తున్న కారణంగా మహిళలు, విద్యార్థినులపై అత్యాచారాలు పెరిగి పోతున్న విషయం వివరించారు. వీటి నివారణకు అశ్లీల వెబ్ సైట్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేణుకా ముదిరాజ్, అనిత తదితరులు ఉన్నారు.