విరమణ ప్రజా సేవకులకు కాదు

పదవీ విరమణ అనేది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ప్రజా సేవకులకు కాదు


 



జి కొండూరు మండల పరిషత్తు అధ్యక్షులు వేములకొండ తిరుపతిరావు గారి పదవీ విరమణ అభినందన సభలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు


ఈ సందర్భంగా కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ ప్రజాసేవకులకు పదవి విరమణ అనేది లేదన్నారు


ఐదేళ్ళ పాటు మండల పరిషత్తు అధ్యక్షునిగా సేవలందించిన తమ్ముడు తిరుపతిరావు రాబోయే రోజుల్లో మరింతగా ప్రజాసేవ చేయాలని సూచించారు


ఈ సందర్భంగా యంపిపీ వేములకొండ తిరుపతి రావు గారి దంపతులను ఘనంగా సన్మానించారు. అదే విధంగా తిరుపతిరావు తండ్రి సాంబయ్య గారి ని కూడా సన్మానించారు. అనంతరం తిరుపతిరావు గారి కుటుంబ సభ్యులు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారిని కూడా ఘనంగా సన్మానించారు


అదే విధంగా మండల పరిషత్తు సభ్యులను కూడా ఘనంగా సన్మానించారు


ఈ కార్యక్రమంలో మండల పరిషత్తు కార్యాలయ సిబ్బంది యంపిటీసి సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు