కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్

కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్


అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిపై సీఎం కేసీఆర్ స్పందించారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే సోదరుడు, జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణపై సీరియస్ కేసీఆర్ అయ్యారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిణిపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కొత్త సారసాల గ్రామంలో అటవీ శాఖ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు భూమిని చదును చేసేందుకు వెళ్లగా.. కోనేరు కృష్ణ తన అనుచరులతో కలిసి వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎఫ్‌ఆర్వో చోలే అనిత, సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోనేరు కృష్ణ సహా 16 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
6వ తేదీ టీడీపీ కార్యాలయం ప్రారంభం