ఆధార్ కార్డు.. ఇక గుర్తింపు కార్డు..
లోక్‌సభ పలు కీలక బిల్లులను ఆదేశించింది. ఇందులో ఆధార్ చట్టం (సవరణ) బిల్లు కూడా ఒకటి. ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. ఆధార్ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఇకపై దీనిని గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం లభించింది. అంతేకాదు, బ్యాంకులో ఖాతా తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లకు దీనిని గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు.
అయితే, ఈ బిల్లులోని ప్రతిపాదిత సవరణలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. కేంద్రం చట్టాలను తీసుకొచ్చేందుకు ఆర్డినెస్స్‌ల బాట పట్టిందని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఏన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్స్‌లను తీసుకొస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆర్డినెన్స్‌లనే చట్టాలుగా మార్చేసిందని ఆరోపించారు. ఎటువంటి కారణం లేకుండానే కేంద్రం ఆర్డినెన్స్‌లను తీసుకొస్తోందని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆధార్ చట్టంలోని సవరణలను వ్యతిరేకించింది. ఆ సవరణల్లో పారదర్శకత లోపించిందని ఆరోపించింది.