టి ఆర్ ఎస్ కి ఆదరణ పెరుగుతుంది

 


రోజురోజుకు  టి ఆర్ ఎస్  పార్టీకి ప్రజాధారణ మరింత పెరుగుతుందని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం ఉప్పల్, lb. నగర్, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలో జరిగిన trs పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పలువురికి సభ్యత్వాలు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలోని trs ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులై స్వచ్చందంగా ముందుకొచ్చి సభ్యత్వాలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో mla లు సుభాష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, mlc ఎగ్గే మల్లేషం, ఇంఛార్జి లు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, రాంమోహన్ గౌడ్, జీవన్ సింగ్, నిరంజన్ వలి, కార్పొరేటర్లు విఠల్ రెడ్డి, మిత్ర కృష్ణ, బంగారి ప్రకాష్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.