ఆగస్టులో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు
టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుండి 22వ తేదీ వరకు కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 14 ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణాలు వైభవంగా నిర్వహించనున్నారు.
కర్నూలు జిల్లా ...
- ఆగస్టు 2వ తేదీన ఓర్వకల్లు మండల కేంద్రంలోని శ్రీ జీవేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.
- ఆగస్టు 3న కల్లూరు మండలం, జహరపురంలోని ఎపిహెచ్‌బి కాలనీ పార్కులో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
- ఆగస్టు 4న గూడూరు మండల కేంద్రంలోని తిమ్మాగురుడు స్వామివారి ఆలయంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
- ఆగస్టు 5న వెల్దుర్తి మండల కేంద్రం, ఎస్.పేరిమాలలోని శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
- ఆగస్టు 6న బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
- ఆగస్టు 7న సంజామల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
- ఆగస్టు 8న అవుకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
అనంతపురం జిల్లా ...
- ఆగస్టు 16న పామిడి మండలం కాండ్లపల్లిలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.
- ఆగస్టు 17న వజ్రకరూరు మండలం, జారుట్ల రామాపురం తాండాలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
- ఆగస్టు 18న విడపనకల్ మండలం, వి.కొత్తకోటలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
- ఆగస్టు 19న బ్రహ్మసముద్రం మండలం, తీటకల్లు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
- ఆగస్టు 20న కనేకల్ మండలం, బెనెకల్‌లో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
- ఆగస్టు 21న రాయదుర్గం మండలం, గ్రామదట్లలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
- ఆగస్టు 22న ధర్మవరం మండలం, సుబ్బారావుపేటలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.