మంత్రులు డమ్మీ..
ఆడుతున్నాడు రమ్మీ
-పేరుకే మంత్రులు..విజయసాయిరెడ్డే చక్కబెట్టేది
-సీనియర్ మంత్రి చుట్టూ నిఘా..
-కొత్త మంత్రుల పరిస్థితి మరీ దయనీయం
వైఎస్ జగన్ పాలనకు కొత్తే కానీ..అవినీతికి కాదు. అందుకే ముఖ్యమంత్రి అయ్యాక తనకు అలవాటైన అవినీతి లేకుండా చేయడమే ధ్యేయమని ప్రకటించారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ మంత్రులకు నీతి కబుర్లు చెబుతూ అవినీతికి తన తాడేపల్లి ఇంటి కాంపౌండ్ చిరునామా చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ మంత్రి చుట్టూ ఏకంగా ఒక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారట. దీంతోపాటు మంత్రికి సహకరించని జగమొండి అధికారులను ఆయన శాఖలకు కేటాయించారని మరో వార్త గుప్పుమంటోంది. అలాగే తన మీడియా ప్రతినిధులు ఆ మంత్రి వెంటే నిత్యమూ ఫాలో అవుతూ తీవ్ర అసహనానికి గురి చేస్తున్నారట. తనను డమ్మీ చేసి..విజయసాయిరెడ్డి రమ్మీ ఆడుతుండటంపై సీనియర్ మంత్రి గుర్రుగా ఉన్నారట.
మరో మహిళా మంత్రి పరిస్థితి మరీ దయనీయంగా ఉందట. ఆమె చాలా మంచి అవకాశం దొరికిందనుకుని సంబరపడిపోయిందట. తనను ``హోం``కి పరిమితం చేసేలా ఉందట పరిస్థితి. తన జిల్లాలో ఒక బదిలీ చేయించుకుందామంటే..విజయసాయిరెడ్డి అడ్డు పడ్డారట. అవినీతి అంటూ అరిచి మంత్రి చెప్పినవారికి పోస్టింగ్ లేకుండా చేశాడట. దీంతోపాటు ఈ శాఖలో జరిగే ప్రతీ వ్యవహారాన్ని నేరుగా జగన్ కి చేరవేసేందుకు ఒక మాజీ ఐపీఎస్ ని కాపలా పెట్టారట. ప్రతీ మంత్రీ నిఘానేత్రంలోనే ఉన్నారట. కొద్దిగా ముదురు మంత్రుల వద్ద తన సామాజికవర్గం అధికారిని మొహరించారట. ఆ మంత్రుల ఆటలు సాగకుండా చెక్ పెట్టారట. అందరి మంత్రులకూ, ఎమ్మెల్యేలకూ ఇదే పరిస్థితి లేదట. తన బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి పీఏ ఏకంగా నకిలీ లెటర్ హెడ్లతో బదిలీలు చేయించుకుని కోట్లు దండుకున్నా.. నోరు మెదపలేదట సీఎం.
తనకు దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్దన్ రెడ్డి లింకు అయిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తన నియోజకవర్గం పరిధిలో ఉన్న స్టోన్ క్రషర్ల వారినంతా పిలిపించుకుని ఒక్కో క్రషర్కూ 2 లక్షలు కట్టాలని హుకుం జారీ చేశారట. అయితే గతంలో ఎప్పుడూ తమని ఎవరూ ఇలా మామ్మూళ్లు అడగలేదని చెబితే..డబ్బులు ముట్టజెప్పేవరకూ క్రషర్లు నిలిపేయాలని ఆదేశించారట. క్రషర్ల యజమానులంతా కలిసి ముందుగా పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు వెళ్తే...నేనేం చేయగలను? ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాడు..మీరో ఏదో విధంగా సర్దుకుపోండి అన్నారట. అదే సమయంలో క్రిష్ణా జిల్లాలో ఓ బీసీ ఎమ్మెల్యే సీఐ బదిలీ కోసం 3 లక్షలు తీసుకున్నాడనే సమాచారం తాడేపల్లి కలెక్షన్ పాయింట్ కి చేరింది. ఆగమేఘాల మీద ఆ బీసీ ఎమ్మెల్యేని పిలిపించి కప్పం కట్టించుకుని మరీ వార్నింగ్ ఇచ్చారట. ఇదండీ మాట తప్పుడు..మడమ తిప్పుడు నాయకుడు పాలన.