వ్యాప్తంగా‘పంచాయతీ’సమ్మేళనాలు

వ్యాప్తంగా'పంచాయతీ'సమ్మేళనాలు


హైదరాబాద్ స్థానిక ప్రజాప్రతినిధులకు కొత్త పంచాయతీరాజ్​ చట్టంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగుచోట్ల త్వరలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. ఇటీవల నిర్వహించిన పలు సమీక్ష సమావేశాల్లో ఈ విషయాన్ని సీఎం వెల్లడించగా, ఆమేరకు పంచాయతీరాజ్​శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.


పంచాయతీరాజ్​ చట్టంపై అవగాహనే లక్ష్యం


రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో నిర్వహించాలని భావిస్తున్న పంచాయతీ సమ్మేళనాలకు సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మొదలుకొని జెడ్పీ చైర్​పర్సన్ల వరకు అందరినీ ఆహ్వానించనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతలను వివరించడంతోపాటు కొత్త పంచాయతీరాజ్ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. కొత్తగా నియమితులైన పంచాయతీ కార్యదర్శులకు కూడా 3 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల చివరనగానీ, వచ్చే నెల మొదటి వారంలోగానీ మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికల తర్వాతే మేడ్చల్, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్​నగర్​లలో సమ్మేళనాలను నిర్వహించాలని పంచాయతీరాజ్​శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యేలా చూడాలని భావిస్తున్నారు. శిక్షణకు అవసరమయ్యే పుస్తకాలను రాజేంద్రనగర్ లోని తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ముద్రిస్తోంది. పంచాయతీ కార్యదర్శుల కోసం మరో మూడు హ్యాండ్ బుక్కులను ప్రింట్​ చేస్తోంది. కాగా, పంచాయతీ సమ్మేళనాల ముసాయిదా ప్రతిపాదన ఇప్పటికే సీఎం కేసీఆర్​ను చేరినట్లు తెలుస్తోంది. ఆయన ఆమోదం అనంతరం పంచాయితీ రాజ్ శాఖ అధికారులు త్వరలోనే తేదీలను ఖరారు చేసే అవకాశముంది.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు