జగన్ బలహీనలత లను అర్ధం చేసుకొన్నా కెసిఆర్

 


 



జగన్ బలహీనతలను అర్థం చేసుకున్న కేసీఆర్ ఏపీ భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు. వాస్తవానికి తెలంగాణలో పారే గోదావరికి మహారాష్ట్ర దయతలిస్తే తప్ప నీరు చేరదు. తెలంగాణలో గోదావరిలో కలిసే ఉపనదులు కేవలం వర్షాకాలంలో స్వల్పంగా నీటి తెస్తాయి. కాబట్టి వచ్చిన ప్రతినీటిబొట్టును దాచినా తెలంగాణ గోదావరికి చేరే నీటి వల్ల తెలంగాణలో తడిసే గొంతులు, పొలాలు తక్కువే. అయితే, ఆంధ్రాలో గోదావరి పరిస్థితి అలా లేదు. అవసరానికి మించి నీరు లభ్యం అవుతోంది. దీనికి కారణం చత్తీస్ ఘడ్, ఒడిసా అడవుల నుంచి భారీ ఎత్తున వరద నీరు అనేక చిన్న నదుల ద్వారా వచ్చి గోదావరిలో కలుస్తుంది. దీంతో భద్రాచలం తర్వాత గోదావరిలో పుష్కలంగా నీరు ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కేసీఆర్ పోలవరం ప్రయోజనాలు తెలంగాణకు తీసుకెళ్లాలని కుట్ర పన్నుతున్నారు. అది కూడా మన డబ్బుతో కట్టిన ప్రాజెక్టులతో. మరి జగన్ ఒప్పుకున్నా ప్రజలు ఒప్పుకోరు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఈ విషయానికి ఒక చక్కటి సాకును కేసీఆర్ రెడీ చేశారు. అదే రాయలసీమ ప్రయోజనాలు.


రాయలసీమ సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరాలంటే గోదావరి నుంచి నీళ్లు తెచ్చి శ్రీశైలంలో కలపాలని కేసీఆర్ చెబుతున్నారు. ఇది శుద్ధ అబద్ధం. దీనికి ఇప్పటికే గత ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. పోలవరం, పట్టిసీమ కట్టింది ఇందుకోసమే. కృష్ణా నది నీటిని అత్యధికంగా వాడుకునేది ప్రకాశం బ్యారేజీ ఆయకట్టు. నాగార్జున సాగర్ మీదుగా ప్రకాశం బ్యారేజీకి వెళ్లే నీరు ఎంత ఎక్కువంటే… అది రాయలసీమ, నెల్లూరు జిల్లాల అవసరాలకు సరిపోతాయి. వాటిని శ్రీశైలంలోనే ఆపేస్తారు. ప్రకాశం బ్యారేజీకి పోలవరం నుంచి నీటిని తరలిస్తారు. ఈ నీళ్లు తూర్పుగోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు అందుతాయి.


తన స్వార్థం తప్ప మరేదీ పట్టించుకోని కేసీఆర్ రాయలసీమ పేరు చెప్పి ఏపికి రావల్సిన నీటిని దోచుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం నీటి దోపిడీతో ఆగిపోవడం లేదు. ఎత్తిపోతల పథకాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. ఎంత లేదన్నా ఎకరానికి రూ. 3 వేలు అంతకంటే ఎక్కువ విద్యుత్తుకే ఖర్చు అవుతుంది. ఇపుడు పోలవరం నుంచి శ్రీశైలానికి నీళ్లు తీసుకెళ్లాలంటే చాలా ఎత్తుకు నీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికయ్యే ఖర్చు చాలా అధికం. ఒకరకంగా కాళేశ్వరం అంత ఖర్చ అవుతుంది. అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం నీటిని తీసుకెళ్లడానికి ఏపీ సగం ఖర్చు భరించాల్సి వస్తుందన్నమాట. ఇదే కేసీఆర్ కుట్ర. మన వేలుతో మనకంటినే పొడవడం. ఏపీ మీద అనవసర ఖర్చు మోపడం." - జగనన్న ఏం చెసినా "ఒహోం!ఒహోం!" అంటూ పల్లకీ మొయ్యడం తప్ప మాకేం తెల్దు అంటే మళ్ళీ ఎన్నికల్లో వోట్లు పడతాయా!కేసీయారు కంటే సొంత తెలివి ఉంది, మీ జగనన్నకేం ఉంది?హైదరాబాదులో ఆస్తులున్న తెదెపా వాళ్ళని బెదిరించి తన పార్టీలోకి తెచ్చిపెట్టిన కేసీయారు చుట్టూ తోకూపుకుంటూ తిరగటం తప్ప ఇంతవరకు సొంత తెలివిని చూపించి రాణించిన సన్నివేశం ఒక్కటి కూడా లేదు, ముందు ముందు చూస్తామని నాకు నమ్మకం లేదు!మీ సంగతి చెప్పండి, మీ నాయకుణ్ణి వాజెమ్మని చేసి కేసీయారు దోచుకుపోతున్న రాష్ట్రపు సంపదలో మీకు వాటా లేదా?


మీరు జగనుకీ జగను కేసీయారుకీ బాకాలు వూదుకుంటూ అయిదేళ్ళు గడిపేత్తే సాల్లెమ్మని అనుకుంటున్నారేమో, మోదీ ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ మూడేళ్ళకే మళ్ళీ మిమ్మల్ని జనం ముందు నిలబెట్టబోతున్నాడు, అప్పటికి కూసిన్ని కూడా మంచిపనులు చెయ్యరా?ఈ దిక్కుమాలిన ఎత్తిపోతల పథకం అవసరం లేకుండానే పోలవరం పూర్తయితే ఏపీలోని 13 జిల్లాల సాగునీటి, తాగునీటి ప్రయోజనాలు నెరవేరుతాయి. పోలవరం, శ్రీశైలం అనుసంధానం శుద్ధ తప్పుడు ప్రాజెక్టు. కేవలం తెలంగాణ కోసం ఏపీ మోయాల్సిన బర్డన్. మేలుకుని దీనిని అడ్డుకోకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. లేండి, మేలుకోండి!


80వేల కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలోనే అతిపెద్ద ఎత్తిపోతలుగా రికార్డులకు ఎక్కింది గాని అది అస్సలు ఫలవంతమైన ప్రాజెక్టు కాదని స్పష్టంగా అర్థమవుతోంది. ఆ ప్రాజెక్టులో కేసీయారు స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవని పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. దాని పెట్టుబడి, నిర్వహణ ఖర్చు రాష్ట్రానికి తెల్ల ఏనుగు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.