చేసింది చెప్పుకోలేక పోయారు

 


గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ఉన్న ప్రధాన కారణాల్లో సోషల్ మీడియా ఒకటి.


చేసింది చెప్పుకోలేక పోవటం,


మరో పక్క ప్రత్యర్ధి పార్టీలు అయిన వైసిపీ, బీజేపీ, జనసేన స్పెషల్ టీంలు పెట్టుకుని మరీ, సోషల్ మీడియాలో చేసిన వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్ట లేక పోవటం, తెలుగుదేశం బలహీనతగా చెప్పుకోవాలి. 


ఫేక్ న్యూస్ లు కూడా ప్రత్యర్ధి పార్టీలు స్ప్రెడ్ చేస్తే, అది తప్పు అని ఖండించే వారు తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో ఉండే వారు కాదు. 


స్వచ్చందంగా పని చేసే కార్యకర్తలు ఉన్నా, వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటికి రీచ్ ఉండేది కాదు. 


ఫలితాలు తరువాత, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పై ద్రుష్టి పెట్టినట్టే కనిపిస్తుంది. 
ఇది వరకు లాగా కాకుండా, ప్రత్యర్ధి పార్టీలు ఏదైనా తప్పుడు విమర్శ చేసిన వెంటనే లోకేష్ బాబు గారు ఖండిస్తున్నారు. 


అలాగే మన సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఈ 40 రోజుల నుండి ప్రజా సమస్యలు మరియు అధికార పక్షం మన పార్టీ  పై, బాబు గారి పై  చేస్తున్న తప్పుడు ఆరోపణలు ను   ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అది చాలా ఆనంద దాయకం, అభినందనీయం.


ఇలాగే కొనసాగితే మన పార్టీకి విజయం సాధిస్తుంది  
ఇది మన పార్టీకి శుభపరిణామం అని నేను భావిస్తున్నాను.