పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణి ఉగాది పండగకు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు  ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో సభ్యులుగా ఆర్థిక, సామాజిక సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. కన్వీనర్‌గా భూపరిపాలన శాఖ ప్రత్యేక కమిషనర్‌ను నియమిస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. 2020 ఉగాది నాటికి 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.