సమ్మె విరమించిన 108 ఉద్యోగులు

  


సమ్మె విరమించిన 108 ఉద్యోగులు
 
 108 ఉద్యోగులు సమ్మె విరమించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌మోహన్‌ రెడ్డితో జరిపిన చర్చలు సఫలమవడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. సోమవారం రాత్రి నుంచి 108 సిబ్బంది సమ్మెకు దిగారు. ఆ తర్వాత ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ విఫలమయ్యాయి. దీంతో 108 ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీఎం జగన్‌ను కలిశారు. 108 ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు సీఎంను కోరారు. 108 వాహనాలను ప్రభుత్వమే నిర్వహించడం సహా తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 31లోపు వేతన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ఉద్యోగ భద్రతకు ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని.. త్వరలోనే దాన్ని అమలు చేయనున్నట్లు జగన్‌ వారికి హామీ ఇచ్చారు. 108 ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో గత నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. గురువారం రాత్రి నుంచే విధులకు హాజరుకానున్నట్లు తెలిపారు.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు