మచిలీపట్టణం కాలనీలో...ఖర్జూర చెట్టు 

 మచిలీపట్టణం కాలనీలో...ఖర్జూర చెట్టు 
                                     
' గంగి గోవు పాలు గరిటెడైన ను చాలు ' ... అన్నాడు వేమన ... మంచి ఖర్జూరాలు రెండు తిన్న చాలు... అంటోంది వైద్యం ! ఖర్జూరం... ఎడారులలోని ఒయాసిస్సుల దగ్గర పండి... ఒంటెల మీద ప్రయాణించి...
మానవ సమాజంలోకి ప్రవే శించి... మన నాలుకల మీద కూర్చుని...తియ్య తియ్యగా... రంజు రంజుగా నడయాడుతూ... మనకి శక్తి నిచ్చి... మన చేత తైతక్కలాడిస్తూ...తన రాజసాన్ని నిలుపుకుంటోంది.. ఖర్జూరం..  ఖజురహో శిల్పంలా ఎడారిలో ఠీవిగా నిలబడే మొక్క బందరులో బతికి కాయలు కాయడం సాధ్యమేనా ?.


బందరు ఇంగ్లీషుపాలెం షాదీఖానాలో పెద్ద ఖర్జూర చెట్టు  ఏపుగా పెరిగి అందర్నీ ఆకట్టుకొంటుంటే ..ఇపుడు    నోబుల్ కాలనీలో విశ్రాంత అధ్యాపకులు మంగం చంద్రపాల్ ( ఎం. సి.పాల్ ) గారి పెరటి వెలుపల మరో ఖర్జూర చెట్టు ఆశ్చర్యపరుస్తుంది. నాలుగైదేళ్ల క్రితం ఒక ఖర్జుర గింజను ఆయన నాటేరు..అది చిన్న మొక్కగా మెలిచేసరికి ఆశ్చర్యపోయి..ఆసక్తిగా  పెంచడం ప్రారంభించారు..ఆయన చిన్న కుమారుడు హాలీ ఇంకాస్త ముందుకెళ్లి ఇంటర్నెట్ లో వెతికి ఖర్జుర మొక్కకు అనుకూలమైన వర్మ్ కంపోస్ట్ ..వేపచెక్క సైతం ఉపయోగించి శ్రద్దగా సాగుచేశారు.. ఇపుడు ఆ ఖర్జుర మొక్కకు కాయలు కాయడంతో వారి ఆనందానికి అంతే ఉండటంలేదు. అంతెత్తున ఆకాశంలోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి.  ఈ ఖర్జూర చెట్టు మట్టలు ఇప్పటికే  విద్యుత్ తీగలను తాకే ఎత్తులో పెరగడం  వారికి ఆందోళన కల్గిస్తుంది...మరోవైపు  ఖర్జూరంతో  ఎన ర్జీ సలాడ్, బొబ్బట్లు, ఖీర్, పికిల్, షేక్...ఎలా చేయాలో మంగం హోలీ  ప్రస్తుతం అంతర్జాలంలో శోధిస్తున్నాడు.. 


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?