కొత్తపల్లి గీత పైన సిబిఐ కేసులు

కొత్తపల్లి గీత.

4 పార్టీలు - 2 పాన్ కార్డులు
సిబిఐ దర్యాప్తు - వేగవంతానికి భాజపా సిగ్నల్


రాజకీయంగా నెమ్మదిగా ఎదుగుతారు. అవకాశం కోసం ఎదురుచూస్తారు. ఏదో ఒకరోజు ఠక్కున వచ్చిన ఛాన్స్ ను పట్టేస్తారు. అంతే కోట్లు కొట్టేస్తారు. ఇవన్నీ తెలిసినా ఆ పార్టీలో ఉన్నవాళ్ళు 'అన్ని మూసుకొని' సమర్థించాలి. ప్రతిపక్ష పార్టీ గగ్గోలు పెడుతుంది. ప్రత్యర్థి పార్టీలోకి ప్లేట్ ఫిరాయించగానే ఆ పార్టీలోని వారందరూ తప్పక నోరు మూసుకుంటారు. సరిగ్గా  పార్టీల ఈ 'వీక్ నెస్'తో ఓ మహిళామణి ఆడుకోవడం విశేషం. ఈ ఘరానా మహిళా నాయకురాలి గురించి మొత్తం సమాచార విషయాన్ని... తాజాగా భాజపా అనుబంధ సంస్ధ 'స్వయంసేవక్'లు అమిత్ షా ద్వారా ప్రధానికి చేరవేశారు. అంతే... బతుకంతా బట్టబయలు. జాయింట్ కలెక్టర్ గా ప్రస్థానం మొదలెట్టి.. అంచెలంచెలుగా ఎంపీ...అనంతరం ఊసరవెల్లి సిగ్గుపడే విధంగా పార్టీలు మారటం. చివరకు మారే పార్టీ లేక అదను చూసి ఏకంగా ఓ పార్టీ పెట్టేసింది. వీలుచూసుకొని 'కమలం పూవు' పెట్టుకుంది. ప్రజల చెవుల్లో కాలిప్లవర్లను సరదాగా పెట్టేసింది. ఏం ముఖం పెట్టుకొని ఇంకా మరో పదవికి పాకులాడటం అసహ్యంగా ఉంది. ఆమె పేరు కొత్తగా పరిచయం అవసరం లేని కొత్తపల్లి గీత గారు.



2008లో డిప్యూటీ క‌లెక్ట‌రుగా రంగారెడ్డిలో ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్‌ మక్తాలో పాత ముంబై హైవేకు ఆనుకుని మొత్తం 525 ఎక‌రాలు భూమి ఉండేది. హైటెక్‌ సిటీకి అతి సమీపంలో ఉండ‌టంతో ఎక‌రం రూ.50 కోట్ల‌ పైమాటే. ఈ భూమికి రుక్నుద్దీన్ అనే వ్య‌క్తి 1950 వ‌ర‌కు య‌జ‌మానిగా ఉన్నారు. కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రావ‌డంతో అందులో కేవ‌లం 99 ఎకరాలు మాత్రమే ఆయ‌న‌కు మిగిలింది. త‌రువాత అర్బ‌న్ ల్యాండ్ సీలింగ్ చట్టం అమ‌ల్లోకి వచ్చింది. ఈ నేతలకు పక్కా అవకాశం అనుకోకుండా కలిసొచ్చింది. ఇందులో నుంచి మ‌రో 46 ఎక‌రాలు ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై రుక్నుద్దీన్ హైకోర్టును ఆశ్రయించ‌డంతో 'స్టే' వ‌చ్చింది. ఈ వివాదం ఇలా ఉండ‌గానే ఈ 99 ఎకరాల‌పై మన కొత్త‌ప‌ల్లి గీత 'క‌న్ను' అదోలా ప‌డింది. వాటికి న‌కిలీ ప‌త్రాలు సృష్టించి ఒక్క‌రోజులో త‌న భ‌ర్త పి.రామకోటేశ్వరరావు (పీ.ఆర్‌.కే.రావు)ను హక్కుదారుని కూడా చేసింది. ఇది మన గీత సత్తా.


*ఇదే కాపాడుకునే స్కెచ్:*
మాజీ ఎంపీ, జ‌న‌జాగృతి పార్టీ అధ్య‌క్షురాలు కొత్త‌ప‌ల్లి గీత త‌న పార్టీని బీజేపీలో విలీనం చేశారు. మొత్తానికి ఐదేళ్ల‌లో నాలుగు పార్టీలు మార‌డం, అవినీతి అధికారిగా ఆమె ప్ర‌స్తానం నిత్యం వివాదాల మ‌యం. వాస్తవానికి ఆమె పార్టీలు మార‌డం ఇదేం కొత్త‌ కాదు. 2014లో వైసీపీ నుంచి గెలిచారు. త‌రువాత గీతపై ప‌లు కేసులు న‌మోదు అయ్యాయి. ఈ కేసుల నుంచి బ‌య‌ట ప‌డేందుకు పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరారు. త‌రువాత టీడీపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తుండ‌టంతో బీజేపీతో స‌ఖ్య‌త‌గా మెదులుతూ వ‌చ్చారు. ఎన్నిక‌ల ముందు 'జ‌న‌జాగృతి' పార్టీని స్థాపించారు. అనంతరం పార్టీని భాజపాలో కలుపుతున్నట్లు ఓ కృత్రిమ 'హైడ్రామా'. కమలం గూటికి 'రక్షణ' కోసం చేరింది. అయినా తలరాత మారలేదు. మారదుకూడా..!


*సీబీఐ విచార‌ణ‌లో ర‌ట్టు:*
అంత‌టితో గీత అక్ర‌మాలు ఆగ‌లేదు. ఈ భూమిలో కొన్ని న‌కిలీ కంపెనీల‌ను స్థాపించిన‌ట్లు చూపి పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో గీతతో పాటు ఆమె భర్త, హైదరాబాద్‌కు చెందిన ఒక కంపెనీ ఎండీపై కేసులు నమోదు అయ్యాయి. కొత్త పల్లి గీత వల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ కు అక్షరాల 42.79 కోట్ల రూపాయల నష్టం వాటిల్లందని చార్జిషీట్ స్పష్టంగా పేర్కొంది. గీతకు సహకరించిన బ్యాంక్ అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి.


*ఆ భూమి గీతదే కాదు:*
తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్దేశ పూర్వకంగా బ్యాంకుని మోసం, వంచన చేయడం లాంటి ఆరోపణలతో గీతతో పాటు ఆమె బృందంపై ఐపీసీలోని 120, 420, 458,421, 13(2), రెడ్ విత్ 1(సి) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ రుణంతో కంపెనీలు నిర్మించేందుకు కాకుండా సొంతానికి వాడుకున్నారు. వీరి వ్య‌వ‌హారంపై అనుమానం వ‌చ్చిన‌ బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. అస‌లు అక్క‌డ ఎలాంటి కంపెనీలు లేవ‌ని, అస‌లు ఆ భూమికి గీత‌మ్మకు ఎలాంటి సంబంధం లేద‌న్న విష‌యం సీబీఐ విచార‌ణ‌లో 'బ‌ట్ట‌'బ‌య‌లైంది. ఈ అమ్మోరు పెద్ద ముదురే.. వెనుక ఉన్న ఆ నలుగురు. పెద్ద 'దేశముదుర్లు'.


*రెండు పాన్ కార్డులు:*
దేశంలో ఎవ‌రికైనా ఒక‌టే పాన్ కార్డు ఉంటుంది. కానీ మన కొత్త‌ప‌ల్లి గీత పేరిట రెండు పాన్ కార్డులు ఉండ‌టం సీఐబీ అధికారుల‌నే విస్తుపోయేలా చేసింది. ఈ కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. అయినా ఆమె పాచిక‌లు పార‌లేదు. సరికదా ఆ పార్టీ అనుబంధ సంఘాలు 'కారాలు, మిరియాలు, మసాలా'లు నూరుతున్నాయి.