సరి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు
అసంపూర్తి దరఖాస్తుల వల్ల తిరస్కరణకు గురైన అభ్యర్థులు తిరిగి తమ దరఖాస్తులను సరిగ్గా నింపి దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో వారు లాగిన్‌లోకి వెళ్లి దరఖాస్తులో అడిగిన వివరాలను సరిగ్గా పొందుపరచామా లేదా అన్నది సరి చూసుకుని, అన్ని పత్రాలు సరిగ్గా అప్‌లోడు చేసుకోవాలని ఆర్టీజీఎస్ సూచించింది. దరఖాస్తుకు చివరి గడువులోపే వాటిని సరి చేసుకుని అప్‌లోడు చేయాలి. ఇలాంటి అభ్యర్థులు ఈ కింది లింక్‌లను చూసుకుని తమ దరఖాస్తులను సరిగ్గా నింపి, అన్ని ధృవీకరణ పత్రాలను మళ్లీ అప్‌లోడు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ కొరకు http://bit.ly/Checkapplicationstatus యూజర్ మాన్యువల్ కొరకు http://bit.ly/Howtoeditrejectedapplicants . గ్రామ వాలంటీర్ కోసం http://gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.