స్పీడ్ పెంచిన సీబీఐ

స్పీడ్ పెంచిన సిబిఐ

ఒకేసారి 12 రాష్ట్రాల్లో సిబిఐ సోదాలు


సీబీఐ వరుస సోదాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.


సీబీఐకి చెందిన అవినీతి నిరోధక శాఖ దేశవ్యాప్తంగా రెండో రోజూ సోదాలు కొనసాగిస్తోంది. తాజాగా 14 కేసులకు సం బంధించి 12 రాష్ట్రాల్లోని 18 నగరాల్లో ఏకకాలంలో సోదాలు ప్రారంభించింది.


సుమారు 50 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుపుతున్నట్టు సమాచారం. వివిధ సంస్థలు, కంపెనీలు, వాటికి ప్రమోటర్స్‌గా ఉన్న వారిళ్లల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.


సోమవారం కూడా సీబీఐ ఇదే తరహా తనిఖీలను వివిధ ప్రాంతాల్లో నిర్వహించింది. కోల్‌కతాలోని వివిధ 22 చోట్ల సోదాల్లో పాల్గొంది.