తరాలకు సంపదను సృష్టించేవాడే అసలైన నాయకుడు.

 


తరాలకు సంపదను సృష్టించేవాడే అసలైన నాయకుడు.


దక్షిణ భారతం మొత్తం వర్షాభావంతో అల్లాడుతూ  త్రాగు నీరు కోసం కొన్ని ప్రాంతాలు అలమటిస్తున్న వేళ మన ఆంధ్రాలో పట్టిసీమ ద్వారా సాగుకు నీరందింస్తున్నారంటే అది ఎవరి ముందు చూపో అర్ధం అవుతుందా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికీ?


మన ప్రక్క నున్న తెలంగాణలో మిషన్ భగీరథ, అది ఇది అని చెప్పి, 80000 ల కోట్లతో కాళేశ్వరం అనే భారీ ప్రాజెక్టు కట్టి చివరకు ఈ ఖరీఫ్ కాలంలో సాగుకు నీరందించలేమని చేతులెత్తేశారు.


కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు రాబోవు పరిస్థితులను ముందే గుర్తించి  పోలవరం
లాంటి ప్రాజెక్టు పూర్తి కావటానికి సమయం ఎక్కువ పడుతుంది కనుక, దానికి ప్రత్యామ్న్యాయంగా
స్వల్ప కాల ప్రయోజనాల కోసం తక్కువ ఖర్చుతో పట్టిసీమ నిర్మించారు. 


అంతేకాక ఒక ప్రక్క పోలవరం పనిచేస్తూనే, దాని కోసం త్రవ్విన కాలువల ద్వారా పట్టిసీమను పారిస్తున్నారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో డెల్టా ప్రాంతానికి ఆగస్టు ఆఖరులో నీరు రావటం జరిగింది, అంటే అప్పటికే పట్టిసీమ ద్వారా సాగు మొదలు పెట్టడం జరిగింది. అంటే పట్టిసీమ లేకపోతే డెల్టాలో సాగు కనీసం రెండు నెలలు వెనక్కు వెళ్ళేది.


ఇక ఈసంవత్సరం ఎప్పటికి వచ్చేవో తెలియదు. అలాంటిది ఆయన ముందుచూపు వల్ల మనం సాగు చేయగల్గు తున్నాం. కానీ మన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రేమో ప్రక్క వాళ్ళను పొగుడుతూ మన వాళ్ళ ప్రతిభను చిన్న బుచ్చుతున్నాడు.


ఇకపోతే మన కోసం ఇంతా చేస్తే మనం ఆయనకు ఇచ్చినది ఏమిటో మీరే ఆలోచించుకోవాలి?


ప్రజల డబ్బును ప్రజలకు ఎవరైనా పంచుతారు, కానీ ఆ డబ్బును సరైన సమయంలో సరైన చోట పెట్టి భావి తరాలకు సంపదను సృష్టించేవాడే అసలైన నాయకుడు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) వాయిదా.
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన