రైతులకు 3000 కోట్లు వడ్డీలేని రుణాలు

రైతులకు సున్నా వడ్డీ రుణాల కోసం రూ. 3,000 కోట్లు కావాలని అసెంబ్లీలో రాద్ధాంతం చేసారు జగన్ గారు. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని పథకం అన్నారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వం రూ.979.45 కోట్ల రుణాలు ఇచ్చిందని రుజువయ్యాక, అబ్బే రూ.630 కోట్లే ఇచ్చింది. అదేమంత గొప్పా? అని మాట మార్చారు. అంతవరకూ ఎందుకు? తన తండ్రి పుట్టినరోజును రైతు దినోత్సవం అంటూ పెద్దఎత్తున జరిపి... వడ్డీలేని రుణాల కోసం రూ.3,500 కోట్లు కేటాయిస్తామని కడపలో చేసిన ప్రసంగంలో అన్నారు జగన్ గారు. ఇంతా చేసి బడ్జెట్‌లో ఈ పథకానికి కేవలం రూ.వంద కోట్లు కేటాయించారు. 'గతంలో ఎన్నడూ లేని విధంగా' అంటే ఏదో అనుకున్నాం, నిజమే! ఇంతటి మోసం గతంలో ఎవరూ చేయలేదు అంటున్నారు రైతులు.